సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (13:05 IST)

42 ఏళ్ల వయస్సులోనూ ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా.. పోస్ట్ జిమ్ వీడియో

Dhoni
కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ 42 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా వున్నాడు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐదవ ఐపిఎల్ టైటిల్ తర్వాత, ధోని శారీరకంగా తనకు చాలా పెద్ద సవాలుగా ఉన్నప్పటికీ, అభిమానులు అతనిపై చూపిన ప్రేమ కారణంగా ఐపిఎల్ మరో సీజన్‌ను ఆడటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ ఇటీవల తన 42వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ప్రపంచం మొత్తం "కెప్టెన్ కూల్" కోసం సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇటీవల, ధోని జిమ్ సెషన్ తర్వాత వాకింగ్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది, అతని అద్భుతమైన ఫిట్‌నెస్ స్థాయిని చూసి ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్ షాకవుతున్నారు. కెరీర్‌లో ఈ దశలో కూడా తన ఫిట్ నెస్ కోసం ఆయన చేస్తున్న వర్కౌట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.