సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (14:52 IST)

ట్వంటీ-20 క్రికెట్‌లో.. చైనా చెత్త రికార్డు.. కేవలం 14 పరుగులకే ఆలౌట్

పొట్టి ఓవర్ల ట్వంటీ-20 క్రికెట్‌లో చైనా మహిళల జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చైనా పది ఓవర్లలో కేవలం 14 పరుగులకే ఆలౌటైంది. 
 
ట్వంటీ-20 పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యంత తక్కువ స్కోర్ ఇదే కావడంతో.. చైనా చెత్త రికార్డు నమోదైంది. థాయిలాండ్ మహిళల ట్వంటీ-20 స్మాష్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో చైనా మహిళల జట్టు కుదేలైంది. ఏడుగురు చైనా బ్యాట్స్ విమెన్‌లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. కేవలం ఒక్కరు మాత్రం 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రం సాధించారు. జట్టులో ఇదే టాప్ స్కోర్‌గా నమోదైంది. 
 
ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు 189 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా యూఏఈ మహిళల జట్టు రికార్డు సాధించింది.