శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 14 జనవరి 2019 (14:23 IST)

రజనీ పెట్ట తుర్రోతుర్రు... అజిత్ విశ్వాసం వామ్మో... జగపతి బాబు కారణమా?

సంక్రాంతి సినిమాల సందడి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు వేటికవే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీకి వస్తే సంక్రాంతికి సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంతో పాటు నెరసిన జుట్టుతో నటించే అజిత్ కుమార్ చిత్రం విశ్వాసం కూడా విడుదలైంది. ఈ చిత్రంలో అజిత్ నటన అబ్బో అనిపిస్తోంది. 
 
ఇకపోతే సహజంగా రజినీకాంత్ చిత్రం విడుదలైతే ఆయన చిత్రాన్ని బీట్ చేసే దమ్ము మరో చిత్రానికి వుండదు. కానీ అజిత్ విశ్వాసం మాత్రం రజినీకాంత్ పెట్ట చిత్రాన్ని ఓ రేంజిలో ఆడుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ పెట్టకి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. దీనికి కారణం నయనతార, జగపతి బాబు నటన కూడా అంటున్నారు. మొత్తమ్మీద తమిళనాడు రజినీకాంత్ పెట్టను రెండో స్థానంలోకి అజిత్ విశ్వాసం నెట్టేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు.