శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (13:23 IST)

ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన రిషభ్ పంత్ : ఎమోషనల్ పోస్ట్

risbhabh panth
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిషభ్ పంత్ వీడాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటల్లో పంత్‌ ప్రతి ఒక్కరినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనసాగుతూ వచ్చిన రిషభ్ పంత్... వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ జట్టును వీడుతూ ఒక భావోద్వేగ పోస్టును చేశాడు. 
 
'యుక్త వయసులో నేను ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. అది నా అభివృద్ధికి సహాయపడింది. ఢిల్లీ జట్టుతో తొమ్మిదేళ్ల నా ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ జర్నీ నాకెంతో విలువైంది. జీవితంలో క్లిష్ట సమయాల్లో అభిమానులు ఎంతో అండగా ఉన్నారు. నేను ముందుకుసాగుతున్నప్పటికీ.. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. పంత్ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
కాగా.. ఐపీఎల్‌ వేలంలో రిషభ్‌ పంత్‌పై లక్నో కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతడి కోసం లక్నో, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లక్నో రూ.27 కోట్ల రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. దీంతో లక్నో జట్టులో చేరిన పంత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పంత్‌ పెట్టిన పోస్టు అభిమానుల మనసును హత్తుకుంది.