మంగళవారం, 16 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (17:51 IST)

అట్టహాసంగా కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం.. ధ్రువీకరించిన సునీల్ శెట్టి

KL Rahul
KL Rahul
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లి చేసుకున్నారని బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ధ్రువీకరించారు. తన కూతురు అతియా శెట్టిని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ కు ఇచ్చి కన్యాదానం చేశామని సునీల్ శెట్టి తెలిపారు.
 
పెళ్లి తర్వాత మీడియాతో ముచ్చటించిన సునీల్ శెట్టి.. చాలా అందంగా, చాలా సన్నిహితుల మధ్య ఈ ఫ్యామిలీ ఈవెంట్ జరిగిందని చెప్పారు. కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లిలో పాల్గొన్నారు. తమ ప్రైవసీ దృష్ట్యా అతిథుల కోసం నో-ఫోన్ పాలసీని కూడా ఈ పెళ్లిలో పాటించడం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా ఖండాలాలోని సునీల్ ఫాంహౌస్ లో వీరి వివాహం జరిగింది.  
 
అతియా శెట్టి-కేఎల్ రాహుల్ పెళ్లి వేడుకలో వారి అవుట్ ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనామిక ఖన్నా చికంకారీ లెహంగాను అతియాశెట్టి ధరించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్-అనుష్క శర్మల వివాహంలో ధరించిన దుస్తుల తరహా అవుట్ ఫిట్ అదిరింది.