మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (09:48 IST)

భారత్ అంటే భయపడిపోతున్నారు : ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్లు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు హడలిపోతున్నారని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సకెర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌న

టీమిండియా క్రికెటర్లు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు హడలిపోతున్నారని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సకెర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... ఇండియాతో క్రికెట్ మ్యాచ్‌లంటే తమ ఆటగాళ్లు భయపడుతున్నారన్నారు. 
 
నిజానికి తమ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వరుసగా ఓడిపోతూ ఉంటే ఆందోళన కలుగుతోందని, చాలామంది ఆసీస్ ఆటగాళ్లు కాస్త భయంతోనే మైదానంలోకి దిగుతున్నారన్నారు. వారిలోని భయమే ఓటమికి ప్రధాన కారణమవుతోందన్నారు. ఆటగాళ్లు వీలైనంత స్వేచ్ఛగా ఆడాలన్నదే తన అభిప్రాయమన్నారు.  
 
ఇకపోతే.. వన్డేలకు, టీ-20లకూ ఎంతో తేడా ఉందని, ఇండియాతో తాజా పొట్టి క్రికెట్ పోటీల్లో సగం మంది వన్డే ఆడిన జట్టులో లేని వారేనని, కాబట్టి కొత్త ఉత్తేజం ఖాయమని చెప్పాడు. ఇండియాలో పుంజుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉన్నామని, రాబోయే మ్యాచ్ లలో గెలిచి చూపిస్తామని చెప్పాడు.