బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (12:31 IST)

హెచ్.సి.ఏలో నిధుల గోల్‌మాల్.. విచారణకు హాజరైన అజారుద్దీన్

azaruddin
గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ)లో నిధుల గోల్‌మాల్ అంశంపై ఆయనపై మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. హెచ్.సి.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. 
 
హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయంతెల్సిందే. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.
 
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది.