మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (21:13 IST)

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్- రోహిత్ శర్మ, గిల్ అవుట్

Gill
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే ఈ టెస్టుకు దూరం కానున్నాడు. మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. 
 
అయితే రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలుకు గాయమైంది. 
 
స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలో మరో బ్యాటర్‌ను తొలి టెస్టుకు ఎంపికచేయాలని బీసీసీఐ భావిస్తోంది. దేవదత్ పడిక్కల్‌, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకొవాలని చూస్తోంది.