శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (10:12 IST)

సమ్మర్‌లో బిగ్ ట్రీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా గవాస్కర్ ట్రోఫీ

Cricket
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్‌గా ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఇందుకు ఓకే చెప్పేయడంతో వచ్చే వేసవిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. 
 
1991-92 తర్వాత తొలిసారిగా ఈ వేసవిలో ఆస్ట్రేలియా, భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ, జే షా మాట్లాడుతూ, ఈ సిరీస్‌ను తాము అత్యంత గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.   
ఇకపోతే.. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల సిరీస్‌లో, భారత్ ప్రతిసారీ విజయం సాధిస్తూ మరింత ఆధిపత్యం చెలాయించింది. 2018-19, 2020-21 వరుసగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఇక 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.