శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (19:44 IST)

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో రవిచంద్రన్ అశ్విన్

ashwin
ఐసీసీ పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో భాగంగా తన 100వ టెస్టు ను పూర్తి చేసుకున్నాడు.

ఇంకా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు సాధించాడు. తద్వారా ఐసిసి పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. 
 
ఇంగ్లండ్‌పై 4-51, 5-77తో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐదవ టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి 4-1 సిరీస్ విజయాన్ని పూర్తి చేసింది. ఫలితంగా టీమిండియా కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.