ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (20:16 IST)

వైజాగ్ స్టేడియంలో సెల్ఫీల కోసం కుర్రాళ్లు, మరీ ఆ గీరల చొక్కా వ్యక్తితో రోహిత్ షాక్

Rohit sharma confused
కర్టెసి-ట్విట్టర్
భారత్-దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా శనివారం నాడు విశాఖపట్టణం స్టేడియంలో ఆడేందుకు టీమ్ ఇండియా జట్టు వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఐతే రోహిత్ శర్మతో సెల్ఫీల కోసం దిగిన కుర్రకారు ఒకింత విడ్డూరంగా ప్రవర్తించడంతో రోహిత్ కన్ఫ్యూజ్ అయినట్లు కన్పించాడు. మరీ గీరల చొక్కా వేసుకున్న యువకుడైతే తన కుడిచేతి పిడికిలి పట్టి రెండు వేళ్లు పైకి లేపి ఫోటో తీయమంటూ ఎదుటి వ్యక్తికి సైగలు చేస్తుండటాన్ని రోహిత్ శర్మ విచిత్రంగా గమనించాడు.
 
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ముందు సౌతాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. ప్రస్తుతం 1 వికెట్ నష్టానికి టీమిండియా 30 ఓవర్లలో 180 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 75 పరుగులు చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 84 పరుగులు, కోహ్లి 8 పరుగులతో క్రీజులో వున్నారు.
 
రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పుంజుకుని రాయ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించి సిరీస్‌ను సమం చేసింది. భారత్-దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ 1-1తో సమం కావడంతో ప్రస్తుత మ్యాచ్ కీలకం కానుంది.