శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (15:43 IST)

ఒత్తిడి ఉంటే ఐపీఎల్ ఆడొద్దని : క్రికెటర్లకు కపిల్ సూచన

kapil dev
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు దూరంగా ఉండాలని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కదా దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగిన ఓ ప్రశ్నకు ఈ హర్యానా హరికేన్ పై విధంగా సమాధానమిచ్చారు. 
 
గతంలో కూడా తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. అందువల్ల ఒత్తడిని ఎదుర్కొంటున్న ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్ ఆడటం వల్ల వచ్చే ఒత్తిడి గురించి తాను చాలా ఫిర్యాదులను చూశానని చెప్పాడు. ఆటగాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురైతే ఐపీఎల్‌కు టాటా చెప్పేయాలని సూచించారు. 
 
"ఐపీఎల్‌లో ఆడేందుకు ఆటగాళ్ళ ఒత్తిడిపై చాలా ఉంటుందని గతంలో చాలాసార్లు విన్నాను. అపుడు నేను చెప్పేది ఒక్కటే. ఆడవద్దు.. క్రికెట్‌‍పై ఆటగాడికి అభిరుచి ఉంటే ఒత్తిడి ఉండదు. డిప్రెషన్ వంటి ఈ అమెరికన్ పదాలను నేను నమ్మబోనని చెప్పారు. నేను ఓ మాజీ ఆటగాడిని. ఆటను ఆస్వాదించాను కాబట్టే ఆడాము. ఆటను ఆస్వాదిస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు" అని అన్నారు.