మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (20:40 IST)

శిఖర్‌ ధావన్‌తో హ్యూమా ఖురేషి రొమాన్స్.. వీడియో వైరల్

Shikhar Dhawan_Huma Qureshi
Shikhar Dhawan_Huma Qureshi
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్‌ ఎక్సెల్‌ సినిమాతో గబ్బర్‌ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.
 
కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
 
చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్‌తో కలిసి రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేస్తున్న సీన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
 
ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్‌ ఎక్సెల్‌ తెలుగులో అనుష్క నటించిన సైజ్‌ జీరోకు దగ్గరగా ఉంటుందని టాక్ వస్తోంది.