ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (17:03 IST)

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా శిఖర్ ధవాన్

Sikhar Dhawan
భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్‌గా ఓపెనర్ శిఖర్ ధవన్ నియమితులయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ టోర్నీకి ముందే సౌతాఫ్రికా జట్టు భారత్‌లో వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. 
 
టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌‍లతో కూడిన సిరీస్ ఆడనుంది సెప్టెంబరు 28వ తేదీన తిరువనంతపురంలో తొలి టీ20 జరుగుతుంది. 
 
మరోవైపు, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నుంచి టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే ఆటగాళ్ళకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టింది. ఈ సిరీస్‌కు భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ స్థానలో వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారు.