ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (19:21 IST)

షట్టర్ క్లోజ్ చేసిన iBOMMA

iBOMMA
iBOMMA
ఫ్రీగా క్వాలిటీతో అందుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ను కాలరాసింది ఐ బొమ్మ. దీంతో ఐ బొమ్మ చాఫ్టర్ ముగిసింది. నిర్దాక్షిణ్యంగా తన వెబ్ సైట్‌ను షట్ డౌన్ చేసింది. ఓటీటీ బాదుడు నుంచి అందరినీ ఉచిత కాలక్షేపం కోసం తన వైపు తిప్పుకున్న ఐ బొమ్మ.. ప్రస్తుతం మూతపడింది. 
 
అన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న తెలుగు కంటెంట్‌ను ఒకే చోట చేర్చి.. విత్ అవుట్ యాడ్స్‌తో సినీ ప్రేక్షకులకు అందించింది. డౌన్లోడ్ ఆప్షన్‌ను కూడా ఎనబుల్ చేసి.. అందర్నీ విపరీతంగా ఇంప్రెస్ చేసింది. క్వాలిటీ మ్యాటర్స్ అనే ట్యాగ్ లైన్‌తో అంతటా పాపులర్ అయింది. 
 
కానీ ఏమైందో ఏమో కానీ తన సేవలను తగ్గించుకుంటూ.. ఒక్కేసారి షట్టర్ క్లోజ్ చేసింది. సెప్టెంబర్ 9 నుంచి సైట్‌ షట్‌ డౌన్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసింది. దీంతో సినీ ప్రియులు సందిగ్ధంలో వున్నారు.