మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:49 IST)

వెంకటేశ్‌ అయ్యర్‌ మెడకు బలంగా తగిలిన బంతి.. నొప్పితో నానా తంటాలు

Venkatesh Iyer
Venkatesh Iyer
దులీప్ ట్రోఫీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో గాయపడ్డాడు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పేసర్‌ చింతన్ గజా వేసిన ఓవర్‌లో అయ్యర్‌ బౌలర్‌ దిశగా ఢిపెన్స్‌ ఆడాడు.
 
వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్‌ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్‌ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్‌ తీవ్ర నొప్పితో గ్రౌండ్‌లో విలవిలాడాడు. 
 
ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్‌ కూడా గ్రౌండ్‌లోకి వచ్చింది. ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.