బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (16:36 IST)

కేరళలో విషాదం : అంబులెన్స్ డోర్లు జామ్.. రోగి మృతి

ambulance
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఓ విషాదం జరిగింది. విషమపరిస్థితుల్లో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి వద్దకు వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో 66 యేళ్ల రోగి అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచాడు. 
 
కోయమోన్‌ అనే వ్యక్తి హోటల్‌ నుంచి బయటికి రాగానే ద్విచక్రవాహనం ఢీకొట్టింది. హైవే దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆయన్ను వెంటనే బాచ్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. 
 
డాక్టర్ అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్‌కు మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాదాపు అరగంట పాటు అవి తెరుచుకోకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.