తొలి టెస్ట్ : మూడో ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లిష్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో బర్న్స్ వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ) దొరికిపోయాడు.
ఇదిలావుంటే, భారత జట్టులోకి గాయపడ్డ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఈ మ్యాచ్‌కు కాంకషన్ వల్ల మిస్సయ్యాడు. స్పిన్నర్ అశ్విన్ స్థానంలో ఆల్‌రౌండర్ జడేజాకు స్థానం కల్పించారు. స్పీడ్‌స్టర్ ఇశాంత్ శర్మకు కూడా తుది జట్టులో స్థానం దక్కలేదు.
ఇండియా పేస్ అటాక్‌లో సిరాజ్, శార్దూల్‌లు ఉన్నారు. ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిన ఇండియాకు ఈ సిరీస్ కీలకం కానున్నది. ఇంగ్లండ్, ఇండియా మధ్య మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి.