శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:43 IST)

చెన్నైలో చెత్త పిచ్.. ఆ స‌హ‌కారం వ‌ల్లే గెలిచాం.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్

Jofra Archer
చెన్నై చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ మాత్రం చెన్నై పిచ్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై టెస్టులో ఆడిన లాంటి చెత్త పిచ్‌ను ఎప్పుడూ చూడ‌లేద‌ని ఆర్చ‌ర్ అన్నాడు. చెన్నై పిచ్ లో మొద‌టి రెండు రోజులు బాగానే ఉన్న‌ప్ప‌టికీ త‌రువాత నుంచి అసాధార‌ణ రీతిలో బౌన్స్ వ‌చ్చింద‌న్నాడు. 
 
అయితే తాము విజ‌యం కోసం ప్ర‌య‌త్నం చేశాం కానీ ఇంత సుల‌భంగా గెలుస్తామ‌ని అనుకోలేద‌ని, ఇండియాను ఇండియాలో ఓడించ‌డం స‌వాల్ అవుతుంద‌ని భావించామ‌ని, కానీ పిచ్ వ‌ల్లే తాము గెల‌వ‌గ‌లిగామ‌న్నాడు. పిచ్ స‌హ‌కారం వ‌ల్లే గెలిచామ‌ని స్ప‌ష్టం చేశాడు.
 
అయితే చెన్నై టెస్టు అనంత‌రం బీసీసీఐతోపాటు పిచ్ క్యురేట‌ర్‌, కెప్టెన్ కోహ్లిపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ చాలామంది మాత్రం పిచ్ క్యురేట‌ర్‌నే విమ‌ర్శించారు. అత్యంత చెత్త పిచ్‌ను త‌యారు చేశారంటూ కామెంట్లు చేశారు.