తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతం - ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు మటాష్
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ నిప్పులు చెరిగారు.
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులకు స్వాతంత్ర్యం కావాలంటే దేశం వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, కాశ్మీర్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించాడు.
అంతేకాకుండా, జాతీయజెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని గంభీర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అలాగే, భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరించాడు.