1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (07:49 IST)

నేను మానవుడ్ని - మానవాళి వేదన చెందుతుంటే... గంభీర్ నోట భగత్ సింగ్ వ్యాఖ్యలు

భారత మాజీ క్రికెటర్, ఢిల్లీలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ నోట భగత్ సింగ్ వ్యాఖ్యాలను ఉటంకించారు. నేను మానవుడ్ని - మానవాళి వేదన చెందుతుంటే చూడలేక ఆ పని చేశాను అంటూ వ్యాఖ్యానించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ... గౌతమ్ గంభీర్ పలు రకాల సేవలు అందించారు. ఈ క్రమంలో ఆయన కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబిఫ్లూ మాత్రలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. 
 
ఈ అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్ అంతపెద్దమొత్తంలో ఫాబిఫ్లూ ఎలా కొనుగోలు చేయగలిగాడని ప్రశ్నించింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్‌తో విచారణకు ఆదేశించింది. 
 
దీంతో విచారణ చేపట్టిన ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ గంభీర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనుమతుల్లేకుండానే కొనుగోలు చేసిందని న్యాయస్థానానికి తెలియజేసింది. అంటే తప్పు చేసినట్టు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో, గంభీర్ ట్విట్టర్‌లో స్పందించారు. "నేను మానవుడ్ని.... మానవాళి వేదన చెందుతుంటే నేను తట్టుకోలేను" అంటూ నాడు భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. తద్వారా ప్రజల క్షేమం కోసమే తాను ఫాబిఫ్లూ కొనుగోలు చేశానన్న తన మనోభావాలను ఈ విధంగా వెల్లడించారు.