నాకు తెలిసిన హార్దిక్ పాండ్యా అలాంటోడు కాదు : నటి ఎల్లి అవరమ్

elli AvRam
Last Updated: ఆదివారం, 20 జనవరి 2019 (12:50 IST)
కాఫీ విత్ కరణ్ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వివాదంలో చిక్కుకున్నారు. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత క్రికెట్ జట్టు నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లను తప్పించింది.

ఈ నేపథ్యంలో తాజాగా వీరి వ్యాఖ్యలను ఒకప్పుడు హార్దిక్‌ ప్రియురాలు అని వార్తల్లో నిలిచిన నటి ఎల్లి అవరమ్‌ ఖండించింది. అయితే, తనకు తెలిసిన పాండ్యా అలాంటి వాడు కాదని చెప్పింది. 'హార్దిక్‌ అలా మాట్లాడం చూసి షాక్‌కు గురయ్యా. నాకు తెలిసిన పాండ్యా అలాంటి వాడు కాదు. మహిళలను కించపరిచే ఇలాంటి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం హర్షించదగినద'ని ఎల్లి చెప్పింది.దీనిపై మరింత చదవండి :