శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2023 (11:11 IST)

కివీస్‌తో కీలక మ్యాచ్ : హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరు?

Hardik Pandya
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరంగా కానున్నాడు. చీలమండ గాయంతో పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఎవరిని ఆడించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 
 
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా? లేక పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. అయితే మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభమవనుందనగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
 
హార్దిక్ పాండ్యా సహజంగానే జట్టుకు కీలకమైన ఆటగాడని, అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో జట్టు సమతుల్యత పాటిస్తామన్నాడు. ఉత్తమ ఎంపిక ఉంటుందని అన్నాడు. మొదటి నాలుగు మ్యాచ్‌ల మాదిరిగా జట్టు అంత సమతూకంగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. 
 
శార్థూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోనివచ్చే అభిప్రాయాలు కలిగేలా ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో బౌలింగ్ ఆల్ రౌండర్ కలిగివుండడమే శార్థూల్ ఠాకూర్ పాత్ర అని, అతడు నాణ్యమైన ఆటగాడని వ్యాఖ్యానించాడు. ఇక షమీతోపాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా నాణ్యమైన ఆటగాళ్లని విశ్లేషించాడు. దీంతో తుది జట్టుపై కూర్పుపై  ద్రావిడ్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ శార్థూల్ ఠాకూర్ వైపు మొగ్గుచూపొచ్చని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది.