గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (18:24 IST)

ఆప్ఘనిస్థాన్‌తో మ్యాచ్: బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ పట్టిన ఠాగూర్

Shardul Thakur
Shardul Thakur
వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుత క్యాచ్‌తో అలరించాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టుకున్నాడు. ఆప్ఘన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్భాజ్ షాట్ కొట్టి బంతిని పట్టి అతనిని పెవిలియన్‌కు పంపించాడు. 
 
13వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్ పిచ్ బంతిని గుర్భాజ్ సిక్స్ మలిచే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బౌండరీ లైన్ దాటి అవతలకు వెళ్ళేలా కనిపించింది. ఇంతలో బౌండరీ లైన్ వద్ద ఠాకూర్ అద్భుత క్యాచ్ పట్టాడు.