శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (15:05 IST)

అండర్ -19 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా చిత్తు.. భారత్ విజయభేరీ

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ యువ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముంగిట 329 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచి

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ యువ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముంగిట 329 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ఆసీస్ కుర్రాళ్లు చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ వంద పరుగుల తేడాతో గెలుపొందింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఓపెనర్లు పృధ్వీషా, మనోజ్ కల్రాలు రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 329 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 42.5 ఓవరల్లో 228 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. ఆసీస్ జట్టులో ఎడ్వర్డ్స్ (73) ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ జట్టులో మిగిలిన ఆటగాళ్లెవరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు.