గురువారం, 25 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (14:09 IST)

యశస్వీ జైశ్వాల్ అదుర్స్... అరుదైన రికార్డు.. 19 ఏళ్ల తర్వాత తొలిసారి

Yashasvi Jaiswal
Yashasvi Jaiswal
భారత్- ఇంగ్లండ్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న  ఈ టెస్టు మ్యాచ్ లో యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో  తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. 
 
400 మార్క్‌ను అందుకోకుండా ఇంగ్లండ్ బౌలర్లు కట్టడిచేశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అందులో ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నమోదవ్వడం ఇది కేవలం రెండో సారి మాత్రమే. భారత్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు 34 పరుగులే. 
 
శుభ్‌మన్ గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే టెస్టుల్లో తన సహచరులు 34 కంటే ఎక్కువ పరుగులు చేయకుండా ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ సాధించడం క్రికెట్ చరిత్రలో ఇది రెండో సారి. వెస్టిండీస్ 405 పరుగులు సాధించగా తమ బ్యాటర్లలో రెండో అత్యధిక స్కోరు బ్రావో చేసిన 34 పరుగులే కావడం గమనార్హం. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత లారా రికార్డును జైస్వాల్ సాధించాడు.