ఉప్పల్ మ్యాచ్ : అర్థరాత్రి ఒంటి గంటవరకు మెట్రో రైల్ సర్వీసులు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. స్థానిక ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ పలు ఏర్పాట్లు చేసింది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున స్టేడియంకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి అమలు చేశారు.
ఇందులోభాగంగా, హైదరాబాద్ నగరంలో మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ కారణంగా ఈ అర్థరాతి ఒంటి గంటవరకు నడిపేలా ఏర్పాట్లు చేశారుూ. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, అమీర్‌పేట మధ్య కనెక్టింగ్ రైళ్లు కూడా నడుపనున్నారు. అదేవిధంగా ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపనుంది.