శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (12:05 IST)

టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయం.. మిథాలీ రాజ్ జోస్యం

Mithali Raj
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఖాయమని మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రత్యర్థులపై బలంగా పోరాడుతుందని చెప్పుకొచ్చారు. సెమీఫైనల్స్‌కు చేరబోయే జట్లలో గ్రూప్‌ -2 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వుంటాయని అంచనా వేశారు. 
 
గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్ కచ్చితంగా వుంటుందని మిథాలీ రాజ్ తెలిపారు. మరో స్థానం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ముడిపడుతుంది. ఇక తుది పోరులో నిలిచే జట్టులో భారత్‌ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని మిథాలీ చెప్పుకొచ్చింది. 
 
అలాగే టీమిండియాకు బలమైన ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ నిలుస్తుందని మిథాలీ పేర్కొంది. ఆసీస్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మూడు మ్యాచుల్లో రెండింటిని భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.