ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్ : కష్టాల్లో భారత్.. నాలుగు వికెట్లు ఢమాల్
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ వేదికగా కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుతెబ్బ తగిలింది. జట్టు స్కోరు 26 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ గిల్ (9), ఆ తర్వాత విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి వోక్స్ బౌలింగ్‌లో ఉడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 40. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ మణికట్టుకు గాయమైనట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను తోసిపుచ్చుతూ రోహిత్ శర్మ మైదానంలోకి రావడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, జట్టులో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అటు, వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నప్పటికీ, ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగింది.
ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి అన్నింట్లోనూ గెలిచిన టీమిండియా... నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై నెగ్గితే సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లోనే నెగ్గింది. ఆదివారం మ్యాచ్‌తో కలిపి ఇంగ్లండ్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అన్నింట్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ఏవైనా సెమీస్ చాన్సులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదీకూడా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.