బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (15:11 IST)

రాజ్‌కోట్ టెస్టు : భారత్ విజయభేరీ.. ఇన్నింగ్స్ తేడాతో విండీస్ ఓటమి

రాజ్‌కోట్ వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.
 
ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత జట్టులో ఓపెనర్ పృథ్వీ షా (134), కెప్టెన్ విరాట్ కోహ్లీ (139), రవీంద్ర జడేజా (100 నాటౌట్)లు సెంచరీలతో కదం తొక్కగా రిషబ్ పంత్ 92, పుజారా 86 పరుగులతో రాణించాడు. 
 
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు 181 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 468 పరుగులు వెనుకబడి వెస్టిండీస్ ఫాలో ఆన్ మొదలుపెట్టింది. ఈ రెండో ఇన్నింగ్స్‌లో కూడా వెస్టిండీస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ జట్టులో పావెల్ మాత్రమే అత్యధికంగా 83 పరుగులు చేసింది. 
 
భారత స్పిన్నర్లు కుల్దీప్ ఐదు వికెట్లతో విండిస్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీసుకోవడంతో పాలో ఆన్ ఇన్నింగ్స్‌లో విండిస్ జట్టు 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 272 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.