ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:32 IST)

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు.. చెన్నైకి కష్టమే..?

Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు బైబై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ క్రికెట్‌కు పలు విజయాలను సంపాదించి పెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. 
 
మరోవైపు ధోనీ కెరీర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందిస్తూ.. ధోనీకి వయసు మీద పడుతుందని.. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుందన్నాడు. 
 
ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని, బహుశా ఇదే అతని చివరి ఐపీఎల్ కావొచ్చునని కూడా ధోనీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని వెల్లడించాడు.