బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (09:18 IST)

ఐపీఎల్ 2024 : సొంత గడ్డపై చిత్తుగా ఓడిన గుజరాత్...

dc vs gt
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, గుజరాత్ టైటాన్స్ జట్టు సొంత గడ్డపై చిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీ బౌలర్ల సంచలన ప్రదర్శనతో 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా గుజరాత్ ఆటగాళ్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ తర్వాత 90 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గుర్క్ 10 బంతుల్లో రెండు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 20 పరుగులు చేయగా, పోరేల్ 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 15 రన్స్, షాయ్ హోప్ 19, కెప్టెన్ రిషబ్ పంత్ 16 చొప్పున పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, జాన్సన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు.. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చూస్తే... లోయర్ ఆర్డర్ లో రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే అత్యధికం. సాయి సుదర్శన్ 12, రాహుల్ తెవాటియా 10 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ కే చేతులెత్తేశారు. సాహా (2), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (8), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8), షారుఖ్ ఖాన్ (0) ఘోరంగా విఫలమయ్యారు.