1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 మే 2024 (23:41 IST)

KKR అయ్యర్స్ స్క్వేర్ దెబ్బకి SRH విలవిల: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన కోల్ కతా నైట్ రైడర్స్

KKR Reach Final
KKR vs SRH IPL 2024 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ధాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ కుప్పకూలింది. వెంకటేష్ అయ్యర్(51 పరుగులు), శ్రేయాస్ అయ్యర్(58 పరుగులు) ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగి ఆడటంతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఓడించి IPL 2024 ఫైనల్‌కు చేరుకున్నారు.
 
అంతకుముందు, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా, సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. ఆండ్రీ రస్సెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 159 పరుగులకు SRHను కట్టడి చేయడంలో తలా ఒక వికెట్ తీసుకున్నారు. రాహుల్ త్రిపాఠి 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ గెలిచాడు. SRH టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.