బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (11:51 IST)

ఐపీఎల్ వేలంలో అమ్ముపోని క్రికెటర్లు వీరే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌ కోసం క్రికెట్ ఆటగాళ్ళ వేలం పాటలు బెంగుళూరు వేదికగా జరిగాయి. ఈ వేలం పాటల్లో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌ కోసం క్రికెట్ ఆటగాళ్ళ వేలం పాటలు బెంగుళూరు వేదికగా జరిగాయి. ఈ వేలం పాటల్లో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. శని, ఆదివారాల్లో జరిగిన ఐపీల్ ఆటగాళ్ల వేలంలో ఇప్పటిదాకా ఐపీల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత్యధిక మొత్తాన్ని ఆటగాళ్ల కోసం వెచ్చించారు. అయితే, ఈసారి వేలంలో అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్ల పేర్ల వివరాలు...
 
ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, రజత్ భాటియా, ఉన్ముక్త్ చంద్, శ్రీనాథ్ అరవింద్, రిషి ధావన్, ఇక్బల్ అబ్దుల్లా, మిథున్, హెన్రిక్స్, కోరె ఆండర్సన్, మోర్నీ మోర్కెల్, సిమన్స్, షాన్ మార్ష్, మోర్గాన్, హేల్స్, తిసార పెరీరా, హోల్డర్, స్టెయిన్, మలింగా, రూట్, ఆమ్లా, గప్తిల్, ఫాల్కనర్, బెయిర్ స్టో, మెక్లేనగన్, హేజిల్ వుడ్, జంపా, శామ్యూల్ బద్రి, హెడ్ తదితరులు ఉన్నారు.