శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (15:21 IST)

ఐపీఎల్ వేలం: గౌతమ్ జాక్‌పాట్.. రూ.6.20 కోట్లకు రాయల్స్ కొనుగోలు

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజ

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజు కర్ణాటకకు చెందిన ఆఫ్ స్నిన్నర్ గౌతమ్ జాక్ పాట్ కొట్టాడు.

అతడిని రూ. 6.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు మాత్రమే. గౌతమ్ కోసం అన్ని ఫ్రాంచైజీలూ పోటీపడటంతో డిమాండ్ పెరిగిపోయింది. 
 
అలాగే స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.1.90కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అలాగే మురుగన్ అశ్విన్‌ను రూ.2.20కోట్లకు ఆర్సీబీ కైవసం చేసుకుంది.

ఇదేవిధంగా ఆప్ఘనిస్థాన్‌కు చెందిన స్పిన్ బౌలర్ ముజీబ్ జాద్రాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.4 కోట్లకు దక్కించుకుంది. రెండో రోజు వేలంలో ఓజా, నాథన్ లియాన్‌కు గిరాకీ తగ్గింది.