శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (22:33 IST)

బుమ్రాను మందలించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

Bumrah
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ఐసీసీ మందలించింది. ఇంగ్లండ్ సెంచరీ హీరో ఓల్లీ పోప్ పరుగు తీస్తుండగా బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడికి అడ్డుగా వెళ్లినట్టు నిర్ధారణ అయింది. బుమ్రా కావాలని అడ్డంగా నిలవడంతో ఇద్దరూ ఢీకొన్న పరిస్థితి ఏర్పడిందని ఐసీసీ వెల్లడించింది. 
 
ఇది ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదమని ఐసీసీ తేల్చింది. ఇంకా అధికారిక మందిలింపుతో సరిపెట్టింది. దీంతో బుమ్రా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. 
 
అంతర్జాతీయ క్రికెట్లో 24 నెలల వ్యవధిలో ఏ ఆటగాడి ఖాతాలో అయినా ఇలాంటి డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరినట్లైతే.. అతడిపై ఒక టెస్టు నిషేధం.. లేదా రెండు వన్డేల నిషేధం విధిస్తారని ఐసీసీ పేర్కొంది.