శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (08:32 IST)

స్నేహితురాలిని పెళ్లాడనున్న క్రికెటర్...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తరపున ఆడిన క్రికెటర్ నితీశ్ రానా. ఈయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయన పెళ్లాడబోయే వధువు ఎవరో కాదు.. ఈ క్రికెటర్ స్నే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తరపున ఆడిన క్రికెటర్ నితీశ్ రానా. ఈయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయన పెళ్లాడబోయే వధువు ఎవరో కాదు.. ఈ క్రికెటర్ స్నేహితురాలే. గత ఆదివారం వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వధువు పేరు సాచి మర్వా.
 
ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. ఈ విషయాన్ని కోల్‌‌కతా నైట్‌ రైటర్స్‌ యాజమాన్యం తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించి.. కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. 
 
ఇటీవల మరో యంగ్ క్రికెటర్ సందీప్ శర్మ(సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్) కూడా పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ అయిపోగానే.. ఎవరికివారు ఫ్యామిలీని సెట్ చేసుకునే పనిలో మునిగిపోయారన్నమాట.