1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:31 IST)

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు. ఆయన స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. తొడకండరాల గాయానికి రోహిత్ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 
 
ప్రస్తుతం తొండకండరాలకు చికిత్స తీసుకుంటున్న రోహిత్ శర్మ పూర్తిగా కోలుకునేందుకు ఆరు వారాలు అంటే దాదాపు రెండు నెలల  సమయం పట్టే అవకాశం ఉంది. అదే జరిగే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారు. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత జనవరి 19వ తేదీ నుంచి వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ క్రమంలో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అందిస్తారన్న చర్చ సాగుతోంది. కాగా, తొలి టెస్టులో రాహుల్ చెలరేగి ఆడి 260 బంతుల్లో 123 పరుగులు చేసిన విషయం తెల్సిందే.