సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:38 IST)

రోహిత్ శర్మకు గాయం.. వరల్డ్ కప్‌కు దూరం?

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 12వ దశ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ గాయం ఏర్పడింది. 
 
ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో డైవ్ చేయగా అతని కుడి తొడకండరాలకు గాయమైంది. హిట్‌మ్యాన్ రోహిత్‌ తీవ్ర నొప్పితో విలవిల్లాడుతుండగా దాన్ని గమనించిన టీమ్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే అతనికి వద్దకు వెళ్లి ఆరాతీశాడు. తదుపరి ప్రాథమిక చికిత్స కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన రోహిత్ ఇక మళ్లీ ప్రాక్టీస్ చేయలేదు. 
 
అయితే, రోహిత్ శర్మ గాయంపై ముంబై మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 15న ప్రకటించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ గాయపడటం ఇపుడు బీసీసీఐను ఆందోళనకు గురిచేస్తోంది.