శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (12:44 IST)

రికార్డు సృష్టించిన రెక్స్ సింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు..

మణిపూర్ ఫాస్ట్ బౌలర్ రెక్స్ సింగ్ చరిత్ర సృష్టించాడు. మంగళవారం ఈ యంగ్‌స్టర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించి రికార్డు సాధించాడు. 18 ఏళ్ల ఈ టీనేజర్ లెఫ్ట్ ఆర్మ్ మీడియమ్ పేసర్‌గా బరిలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా 9.5 ఓవర్లలో 10 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో 15 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఆద్యంతం మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న రెక్స్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. మణిపూరుకు ప్రాధాన్యత వహించే రెక్స్ ఇప్పటి వరకు రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా పది వికెట్లు సాధించడం ద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించిన రంజీ బౌలర్లలో రెండో ఆటగాడిగా నిలిచాడు.