1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (11:26 IST)

భారత ఆటగాళ్ళలో ధోనీ ఏడోవాడు...

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తిం

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతడు మరో మైలురాయిని అందుకున్నాడు. 
 
రెండో వన్డేలో ధోనీ 21 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ సాధించిన ఫోర్ల సంఖ్య 752కు చేరింది. భారత్‌ తరపున అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ ఏడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు వరుసలో మాస్టర్‌‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ అత్యధికంగా 2,016 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సెహ్వాగ్‌ (1,132), గంగూలీ (1,122), ద్రవిడ్‌ (950), యువరాజ్‌ సింగ్‌ (908), కోహ్లీ (830)లు ఉన్నారు.