1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. MS Dhoni fined Rs 1000 after caught breaking traffic rules

రాంచీలో అతివేగంగా బండి నడిపిన కూల్ కెప్టెన్: రూ.1000 ఫైన్

Dhoni
టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. కొద్ది రోజుల క్రితమే ధోనీ మరో న్యాయపరమైన సమస్యను ఎదుర్కొన్నాడు. నివాసం కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
 
తాజాగా రాంచీలో వేగంగా వాహనం నడిపినందుకుగాను ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. తన ఇంటి సమీపంలో ధోనీ వాహనం వేగంగా వెళ్లడాన్ని నగరంలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద అధికారులు ఆయనకు ఈ-చలాన్ జారీ చేశారు. 
 
ఈ ఫైన్ అమౌంట్ చిన్నదే అయినా.. ధోనీకి జరిమానా పడటం  సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రాంచీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ-చలాన్ జారీ అయినట్లు తెలుస్తోంది. 
తర్వాతి కథనం
ముంబై వేదికగా టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ : సర్వత్రా ఉత్కంఠ