మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:45 IST)

భార్య నటాషాను చీటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా?!

natasa - hardik
భారత క్రికెటెర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సెర్బియాకు చెందిన మోడల్ స్టాంకోవిచ్ నటాసా, హార్దిక్ పాండ్యాలు పేమించి పెళ్లి చేసుకోగా, వీరికి నాలుగేళ్ల కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. వారి విడిపోవడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.
 
అయితే, హార్దిక్ పాండ్యా చేసిన మోసం వల్లే నటాసా తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నటాషా సోషల్ మీడియా యాక్టివిటీ ఇందుకు కారణంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చీటింగ్, ఎమోషనల్ అబ్యూస్‌కు సంబంధించిన రీల్స్‌ను నటాసా స్టాంకోవిచ్ లైక్స్ కొట్టడమే ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది. 
 
కాగా, టీ20 వరల్డ్ కప్ 2024 ముందే హార్దిక్ పాండ్యా - నటాసా విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ మేరకు చాలా పోస్టులు దర్శనమిచ్చాయి కూడా. వీటిని నిజం చేస్తూ గత జూలై 18వ తేదీన వీరిద్దరూ విడిపోతున్నట్టు సంయుక్త ప్రకటన చేశారు.