1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (19:02 IST)

పంత్‌ని పక్కనబెట్టేశారు... సాహాకు ఛాన్స్.. ధోనీకి వారసుడవుతాడా? (video)

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రపంచంలోనే ఇప్పుడు అత్యుత్తమ వికెట్ కీపర్ అని వెటరన్ కీపర్ పార్థీవ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా 2018లో భారత్ జట్టుకి దూరమైన సాహా.. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ వెస్టిండీస్ టెస్టు సిరీస్ సమయంలో అతడిని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టారు. 
 
అయితే రిషబ్ పంత్ విఫలం కావడంతో  దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తుది జట్టులో అవకాశమిచ్చారు. దొరికిన ఛాన్స్‌ని రెండుజేతులా సద్వినియోగం చేసుకున్న సాహా.. కీపింగ్‌లో వరుస డైవ్ క్యాచ్‌లతో తిరుగులేని ప్రదర్శన కనబర్చాడు. 
 
సాహా కీపింగ్ స్కిల్స్ గురించి పార్థీవ్ పటేల్ మాట్లాడుతూ ‘క్రికెట్ ప్రపంచంలోనే సాహా ఇప్పుడు బెస్ట్ వికెట్ కీపర్ అంటూ కితాబిచ్చాడు. అతని కీపింగ్ టెక్నిక్స్, స్టయిల్‌తో పాటు క్యాచ్‌లు అందుకునే విధానం కూడా చాలా బాగుంటుందన్నాడు. ధోనీ టెస్టు వీడ్కోలు తర్వాత సాహాకి ఆ అవకాశం దక్కగా.. అతను గాయపడటంతో రిషబ్ పంత్‌కి ఛాన్స్ లభించింది.
 
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీలు సాధించిన రిషబ్ పంత్ టెస్టు జట్టులో తన ఎంట్రీని ఘనంగా ఆరంభించాడు. కానీ.. కీపింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ సమయంలో పంత్‌ని పక్కన పెట్టి సాహాకి అవకాశమిచ్చారు. ఇప్పుడు పంత్ వన్డే, టీ20లకి మాత్రమే పరిమితమయ్యాడు. టెస్టుల్లోకి అతడ్ని ఎంపిక చేసినా.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు.