సోమవారం, 10 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 8 మార్చి 2025 (17:47 IST)

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ : ఆల్‌రౌండర్లదే కీలక.. రవిశాస్త్రి

ravishastri
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం ఇరు జట్లూ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉండటమే. అయితే, భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి ఈ మ్యాచ్‌ ఫలితంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్లు అత్యంత కీలక భూమికను పోషించనున్నారని తెలిపారు. భారత జట్టులో అక్షర్ పటేల్ లేదా జడేజా, కివీస్ జట్టులో ఫిలిప్స్ .. వీరిలో ఎవరో ఒకరు మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకుంటారని తెలిపారు. 
 
వీరేకాకుండా, భారత జట్టులో విరాట్ కోహ్లీ, కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర కూడా మ్యాచ్‌లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిందని, అయితే, టీమిండియాను ఓడించే సత్తా న్యూజిలాండ్‌కు ఉందని ఆయన అన్నారు. 
 
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు : గూగుల్ జెమిని - చాట్ జీపీటీ ఏం చెబుతున్నాయి? 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, మార్చి 9వ తేదీ ఆదివారం రోజున ఫైనల్ పోరు జరుగనుంది. ఇందులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ పోటీలో విజేత ఎవరన్నది ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరగా, చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో కివీస్ జట్టు ఓడిపోయింది. బలాబలాలపరంగా, ఫామ్‍లో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఆదివారం నాటి మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై ప్రముఖ ఏఐ చాట్ బాట్లైన చాట్ జీపీటీ, గూగుల్ జెమినిలు ఏం చెబుతున్నాయో ఓసారి తెలుసుకుందాం. 
 
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధిస్తుందని చాట్ జీపీటీ జోస్యం చెప్పింది. దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌పై విజయం కూడా పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఫైనల్లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‍‌లు కీలకంగా మారారు. అదేసమయంలో ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ రికార్డును తక్కువగా అంచనా వేయలేమని పేర్కొంది. గత దశాబ్దకాలంలో వారు ఐదు పర్యాయాలు అంతర్జాతీయ ట్రోపీ ఫైనల్‌కు చేరుకున్నారు. గత 2021 వరల్డ్ విజేతగా నిలిచారని గుర్తుచేసింది. 
 
గూగుల్ జెమినీ అంచనా ప్రకారం.. ఈ టోర్నీలో విజేత ఎవరో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. అయితే, భారత్‌కు కాస్తంత మెరుగైన అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ డెప్త్‌గా కనిపిస్తుంది. మరింత విధ్వంసక శక్తిని తలపిస్తుంది. కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగలరు. భారత బౌలర్లు మాత్రం పకడ్బంధీగా బౌలింగ్ చేస్తే కప్ మాత్రం భారత్‌దే అని పేర్కొంది.