సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (16:51 IST)

భారత స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు

ashwin
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిఫ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. పూణేలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
కివీస్ కెప్టెన్ లాథమ్ వికెట్ తీయడంతో ఈ ఘనతకు చేరుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 188 వికెట్లు ఉన్నాయి. దీంతో ఆసీసీ బౌలర్ నాథన్ లయన్ (187)ను అధిగమించాడు. ఆ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (175), మిచెల్ స్టార్క్ (147), స్టువర్ట్ బ్రాడ్ (134) ఉన్నారు. 
 
అశ్విన్ డబ్ల్యూటీసీలో 74 ఇన్నింగ్స్‌లలో 20.75 సగటుతో 188 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్లు హాల్ 11 సార్లు నమోదు చేశాడు. మరోవైపు లయన్ 78 ఇన్నింగ్స్‌లలో 26.70 సగటుతో 187 వికెట్లుతో 10 ఐదు వికెట్ల హాల్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. అశ్విన్ అంతకంటే 2500 బంతులు తక్కువగా బౌలింగ్ చేసినప్పటికీ లయన్‌ను అధికమించడం గమనార్హం. 
 
డబ్ల్యూటీసీలో అత్యధికి వికెట్లు తీసిన బౌలర్ల వివరాలను పరిశీలిస్తే, అశ్విన్ (భారత్) 188, నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా) 187, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) 175, మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 147, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) 134 చొప్పున వికెట్లు తీశారు.