గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (15:07 IST)

రియాన్ పరాగ్‌ ఓవర్ బిల్డప్.. క్యాచ్ మిస్ చేసి ట్రోలర్స్‌కి దొరికిపోయాడు..

Riyan Parag
Riyan Parag
రియాన్ పరాగ్‌ ప్రస్తుతం ఇతని పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఆటతో కంటే ఓవర్ బిల్డప్‌తో వార్తల్లో నిలుస్తాడు. అతడికిది కేవలం నాలుగో సీజన్ మాత్రమే.
 
ఇప్పటి వరకు ఆడిన 46 మ్యాచ్ ల్లో కేవలం 507 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్ లో అయితే 16 మ్యాచ్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు. 
 
ఇతడు తమ జట్టుకు మంచి ఫినిషర్ అవుతాడని ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. కానీ అనుకున్నట్లు కుదురుకోలేదు. 
 
తాజాగా ఎంతటి కష్టమైన క్యాచ్ నైనా సరే కళ్లుమూసుకుని పట్టేస్తా అన్నట్లు బిల్డప్ ఇచ్చే రియాన్ పరాగ్.. రాయల్ చాలెంజ్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈజీ క్యాచ్‌ను మిస్ చేసి ట్రోలర్స్‌కు దొరికిపోయాడు.  
 
క్వాలిఫయర్ 2లో భాగంగా రజత్ పటిదార్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రియాన్ పరాగ్ మిస్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ జట్టు ఫ్యాన్స్ పరాగ్‌ను ఉతికి ఆరేసేవారు.