గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (11:35 IST)

కత్రినా - జాక్వలిన్‌లతో డేటింగ్ చేయాలంటున్న ఆ ఇద్దరు క్రికెటర్లు?

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో తమ అద్భుత ఆటతీరుతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. పైగా, టీమిండియాలో స్టార్ ఆటగా

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో తమ అద్భుత ఆటతీరుతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. పైగా, టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా మారిపోయారు.
 
అయితే, ఈ వీరిద్దరు క్రికెటర్లను మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ఆసక్తిర ప్రశ్నలు సంధించారు. మహిళాభిమానులు పెరుగుతున్న ఈ తరుణంలో ఎవరైనా మాటలు కలిపితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు చాహాల్ స్పందిస్తూ, తనకు కనీసం ఐదారేళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయి అయితేనే తాను మాట్లాడతానని, లేకుంటే, నా నోట మాటరాదని ఠక్కున బదులిచ్చాడు. 
 
ఇక ఇదే ప్రశ్నకు తాను మాటకారిని కాదని, సిగ్గు ఎక్కువని, ఒకటి రెండు మాటలతోనే సరిపెడతానని కులదీప్ సమాధానమిచ్చాడు. ఎవరితో డేటింగ్ కావాలని అడిగితే చాహాల్ కత్రినా కైఫ్ పేరును, కులదీప్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ పేరును చెప్పారు. ఏ కారు కావాలని అడిగితే, సెకండ్ హ్యాండ్ అయినా 'పోర్స్చ్' కావాలని చాహాల్, 'ముస్తాంగ్' అంటే ఇష్టమని కులదీప్ అన్నారు. డేటింగ్‌కు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారని అడిగితే ఫ్రాన్స్ ద్వీపం బోరాబోరా పేరును చాహాల్, పారిస్ పేరును కులదీప్ చెప్పారు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.