బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:56 IST)

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఏకైక భారత కెప్టెన్‍‌గా గుర్తింపు!

rohit sharma
భారత క్రికెట్ జట్టు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లను రోహిత్ సారథ్యంలోని భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో నాలుగు వన్డే సిరీస్‌లను వైట్ వాష్ చేసిన తొలి కెప్టెన్‌గా హిట్ మ్యాన్ నిలువగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలు ఉన్నారు. 
 
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా గత 2022లో వెస్టిండీస్, 2023లో శ్రీలంక, 2023లో న్యూజిలాండ్, 2025లో ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో ఈ ఘనత సాధించాడు. దీంతో నాలుగు వన్డేల్లో వేర్వేరు ప్రత్యర్థులను వైట్ వాష్ చేసిన మొదటి భారత కెప్టెన్‌ కూడా రోహిత్ అయ్యాడు. తర్వాతి స్థానాల్లో మూడేసి క్లీన్ స్వీప్‌లతో విరాట్ కోహ్లి, ధోనీలు నిలిచారు. కాగా, గత 4 యేళ్లలోనూ అత్యధిక క్లీన్‌స్వీప్‌లు చేసిన జట్టుగా భారత్ (12) నిలిచింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్విప్‌లతో రెండో స్థానంలో ఉంది.