1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:40 IST)

రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 100 పరుగుల ఆధిక్యం

భారత ఓపెనర్ రోహిత్ శర్మ క్లాస్ సెంచరీ సాధించాడు. చటేశ్వర్ పుజారాతో కలిసి అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్, కెఎల్ రాహుల్ అద్భుతంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఉదయం సెషన్‌లో 46 పరుగుల వద్ద రాహుల్‌ను అవుట్ చేశాడు.
 
టీ సమయానికి భారత్ 69 ఓవర్ల తర్వాత 199/1 వద్ద నిలిచింది, 100 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ తన ఎనిమిదవ టెస్టులో సెంచరీ సాధించి విజృంభిస్తున్నాడు. పుజారా నాటౌట్ 48 పరుగులతో క్రీజులో వున్నాడు.